యూట్యూబ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంగ్లా వీడియో వైరల్

Arun Chilukuri
Published on: 23 Jan 2021 3:35 PM IST
యూట్యూబ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంగ్లా వీడియో వైరల్
X

యూట్యూబ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంగ్లా వీడియో వైరల్


రష్యా అధ్యక్షుడు పుతిన్ కట్టించుకున్న అత్యంత విలాసవంతమైన భవనం తాలూకు వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది. అప్‌లోడ్‌ చేసిన నాలుగు రోజుల్లోనే ఆ వీడియోను సుమారు 6 కోట్ల మంది చూశారంటే ఆ భవంతి ఏ విధంగా ఉండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్షరాలా 10 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భవనంలో నివాస స్థలం ఏకంగా లక్షా 95 వేల చదరపు అడుగులట. ఆ భవంతిలోనే పెద్ద స్విమ్మింగ్ పూల్, చర్చి, యాంఫీ థియేటర్‌లతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఫర్నీచర్‌ సమకూర్చుకున్నారట. అయితే ఈ భవనం, పుతిన్‌ బంగ్లానేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story