కళ్లాల్లో ఉంచుతున్న వేరుశనగ కాయలను ఎత్తుకెళ్తున్న దొంగలు

కళ్లాల్లో ఉంచుతున్న వేరుశనగ కాయలను ఎత్తుకెళ్తున్న దొంగలు
x
Highlights

ఆరుగాలం శ్రమించారు. కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నారు. వచ్చిన దిగుబడిని కళ్లాల్లో వేశారు. ఇంటికి తీసుకెళ్లే సమయంలో దొంగలు కబళించారు....

ఆరుగాలం శ్రమించారు. కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నారు. వచ్చిన దిగుబడిని కళ్లాల్లో వేశారు. ఇంటికి తీసుకెళ్లే సమయంలో దొంగలు కబళించారు. దొంగల బెడద వేరుశనగ కాయల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో రైతులకు లక్షల్లో నష్టంవాట్టిల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. కళ్లాల్లో ఉంచుతున్న వేరుశనగ కాయలను దొంగలించుకుపోతున్నారు. దీంతో రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లితుంది. ఈ దొంగలను పట్టుకోవడం రైతులకే కాదు పోలీసులకు కూడా సవాల్‌గా మరింది.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దొంగలు ఎత్తుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో సుమారు 70 బస్తాల వేరుశనగ కాయలు అపహరణకు గురయ్యాయి. గుడిమల్లంకు చెందిన ఓ రైతు పండించిన 115 వేరుశనగ బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాలో నుంచి వేరుశనగలు బస్తలను దొంగలించడం అంత ఆషామాషి కాదు. మూటలు మొయడానికి ఒక మూఠనే వచ్చి ఉంటుందని బాధితులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇప్పటికైన దృష్టి సారించి దొంగలను కట్టడి చేయాలని కోరుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories