ఆక్వా రంగంపై కరోనా ఎఫెక్ట్

ఆక్వా రంగంపై కరోనా ఎఫెక్ట్
x
Highlights

Coronavirus Effect on Aqua Culture : ఆక్వా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నుండి కోట్లాది...

Coronavirus Effect on Aqua Culture : ఆక్వా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నుండి కోట్లాది రూపాయల విలువ చేసే రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో రవాణాలు నిలిచిపోయాయి. శీతలీకరణ గోదాముల్లో రొయ్యల నిల్వలు పేరుకుపోయి కొత్త ఉత్పత్తులు నిల్వ చేయడానికి ఖాళీ లేకుండా పోయింది. దీంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

కొవిడ్ ఎఫెక్ట్ తో విశాఖలో ఆక్వారంగం ఎగుమతుల వ్యాపారం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒడిదొడుకుల కారణంగా ఎగుమతి ఆర్డర్లు రద్దవుతున్నాయి. దీంతో సముద్రంలో వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత మత్స్యకారులు, వ్యాపారులు అమ్మకాలు లేక నష్టాలు చవిచూస్తున్నారు. రొయ్యల్లో మంచి ధర పలికే లోబ్ స్టార్ లాంటివి హార్బర్ కే పరిమితమవుతున్నాయి. దీంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడి రొయ్యల ధరలు 50 శాతం పడిపోయాయి. కరోనాకు ముందు టైగర్, లోబ్ స్టార్ వంటి రొయ్యలు కిలో 1200 రూపాయల వరకు పలికేవి. కానీ ప్రస్తుతం సగం ధరకు అమ్మినా కొనటం లేదంటూ వాపోతున్నారు.

రొయ్యల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. వాటిలో 50 శాతం విశాఖపట్టణం, మిగిలిన 50 శాతం కృష్ణపట్నం, చెన్నై నౌకాశ్రయాలకు వెళ్తున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి నిత్యం వందల కేజీల రొయ్యలు ఈశాన్య రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతాయి. కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుండేది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఆర్డర్లు తగ్గి ప్రాసెసింగ్‌ యూనిట్ల యజమానులు కొనుగోళ్లు తగ్గించారు. అయినా భారీగా రొయ్యలు వస్తుండటంతో కౌంట్‌ ధర సగానికి పడిపోయింది. కొన్ని రోజుల పాటు నిల్వ చేద్దామన్నా శీతల గిడ్డంగులు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. కొనుగోళ్లు జరగకపోవటంతో మేలిరకమైన టైగ‌ర్ రొయ్యలు, లోబ్ స్టార్ రొయ్యల ఉత్పత్తి క్రమంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఆక్వా రైతులు చెరువుల్లో టైగ‌ర్ రొయ్యలను వేయ‌డం మానుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటే తప్ప కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదంటున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories