Top
logo

మరో వివాహేతర సంబంధం రగడ..మొన్న ప్రగతినగర్..ఇవాళ చింతల్

మరో వివాహేతర సంబంధం రగడ..మొన్న ప్రగతినగర్..ఇవాళ చింతల్
Highlights

మొన్న హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ది ...

మొన్న హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ది చేసిన భార్య సంఘటన మరువక ముందే ఇవాళ చింతల్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పరాయి మహిళతో కలిసివున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుంది. బంధువులతో కలిసి మొగుడ్ని, అతడి ప్రియురాలికి దేహశుద్ధి చేసింది.

భద్రాది జిల్లా సారెపాక ప్రాంతానికి చెందిన లావణ్య కు కృష్ణ జిల్లా నరసరావు పాలెం ప్రాంతానికి చెందిన సుధాకర్ కు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. హైదారబాద్ లోని చింతల్ లో నివాసం ఉంటున్న వీరికి ఓ పాప వుంది. మరోవైపు సుధాకర్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన పేరు మార్చుకుని చింతల్ లో అద్దె ఇల్లు తీసుకుని ప్రియురాలితో సహాజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ బాబు పుట్టాడు. ఇటీవల లావణ్యకు భర్త అక్రమ సంబంధం తెలిసింది. చింతల్ లో ప్రియురాలితో వున్న భర్తను అడ్డంగా పట్టుకుంది. బంధువులతో కలిసి భర్తను, ఆమె ప్రియురాలిని చితకబాది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Next Story


లైవ్ టీవి