Top
logo

పోలీసుల అదుపులో ప్రియాంక హత్య కేసు నిందితులు

పోలీసుల అదుపులో ప్రియాంక హత్య కేసు నిందితులు
X
Highlights

డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి...

డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక ప్రయాణించిన స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ప్రియాంకను హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్‌ను నిందితులుగా పోలీసులు గుర్తించారు.

మరోవైపు ప్రియాంక ప్రయాణించిన స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. దుండగులు స్కూటీ నెంబర్ ప్లేట్లను తొలగించి బస్టాండ్ దగ్గర వెదిలివెళ్లారు. స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కూటీ దొరికిన ప్రాంతాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా అనుమానించిన పోలీసులు లారీ నెంబర్‌ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Web TitleVeterinarian Priyanka Reddy murderers in police custody?
Next Story