సుషాంత్‌ మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Arun Chilukuri
Published on: 19 Jun 2020 2:02 PM IST
సుషాంత్‌ మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
X

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్‌ పుత్ర నగర్‌కు చెందిన సుమన్‌ కుమారి సుశాంత్‌కు అభిమాని. సుమన్‌ కుమారి టిక్‌ టాక్‌ వీడియోలు చూడడం బాగా అలవాటు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ మరణంకు సంబంధించి టిక్‌ టాక్‌లో తరచూ వీడియోలు చూస్తుండేది.

సుశాంత్‌ చనిపోయినప్పటి నుంచి ఇంట్లో కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులకు చూపిద్దామని అనుకునేంతలో ప్రాణాలను తీసుకుందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గత ఆదివారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story