మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడికి దేహశుద్ధి

మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడికి దేహశుద్ధి
x
Highlights

సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జింకల వాడలో అంజీ అనే యువకుడిని స్థానికులు చితకబాదారు. జింకలవాడలో చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా...

సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జింకల వాడలో అంజీ అనే యువకుడిని స్థానికులు చితకబాదారు. జింకలవాడలో చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో దేహశుద్ధి చేశారు. ఇళ్లల్లోకి దూరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అంజిని కరెంటు పోల్‌కి కట్టేసి చితకబాదిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. జింకలవాడలోని స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories