నోట్ల దొంగను నోట్లే పట్టించాయి .. ఎలాగంటే !

నోట్ల దొంగను నోట్లే పట్టించాయి .. ఎలాగంటే !
x
Highlights

పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు .ఏ ఆయుధం పట్టుకున్నావాడు అదే ఆయుధంతో పోతాడని .. ఈ సామెత ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుందేమో మరి .. ఓ యజమాని తన ఇంట్లో...

పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు .ఏ ఆయుధం పట్టుకున్నావాడు అదే ఆయుధంతో పోతాడని .. ఈ సామెత ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుందేమో మరి .. ఓ యజమాని తన ఇంట్లో డబ్బులు దాచిపెడుతుంటే పోతున్నాయి . దీనితో ఈ సారి అ యజమాని పక్కా ప్లాన్ తో అ దొంగను పట్టుకున్నాడు . ఇక వివరంగా వెళ్తే పోలీసులు చెప్పిన కథనం ప్రకారం .. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే భీంరెడ్డి పటేల్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉప్పరి అఖిల(20) గత ఆరునెలల నుండి పని చేస్తుంది .

తరుచుగా యజమాని పెట్టిన డబ్బులను దొంగిలిస్తూ వస్తుంది .. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అ యజమాని మొత్తం రూ.2100 గదిలో పెట్టి అ నోట్లకి సంబంధించిన నెంబర్ లను రాసుకున్నాడు . కాసేపటికి అనుకున్నట్టుగానే అ డబ్బులు కనిపించకపోవడంతో పోలీసులకి ఫోన్ చేయగా పోలీసులు వచ్చి విచారణ చేయగా యజమాని రాసుకున్న నోట్ల నెంబర్ లకు మరియు అఖిల దగ్గర ఉన్న నోట్ల నెంబర్ లకు పోలిక ఉండడంతో నేనే దొంగతనం చేసానని అఖిల ఒప్పుకుంది . పోలీసులు మొత్తం ఆమె దగ్గరి నుండి రూ. 16,500 స్వాధీనం చేసుకుని, అఖిలను రిమాండ్‌ తరలించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories