పోలీస్ ఇన్వెస్టిగేషన్‌: ఈ దొంగ ఆడా.. మగా?

jail
x
jail
Highlights

ఎన్నో మిస్టరీ కేసులు చేధించే పోలీసులకు..ఓ కేసు విషయంలో తల పట్టుకుంటున్నారు. నిందితుడు ఆడనా మగనా తెలియక తికమకపడుతున్నారు.

ఎన్నో మిస్టరీ కేసులు చేధించే పోలీసులకు..ఓ కేసు విషయంలో తల పట్టుకుంటున్నారు. నిందితుడు ఆడనా మగనా తెలియక తికమకపడుతున్నారు. నిందితుడిని మగవాడిగా భావించి పోలీసులు విచారించారు. కేసు డైరీ రాసే సమయంలో నిందితుడు తాను అమ్మాయినని చెప్పడంతో కంగుతిన్నారు.

హైదరాబాద్ లోని కుషాయిగూడలో కార్ల చీటింగ్ కేసును ఈ నెల 3న పోలీసులు చేధించారు. నిందితులు పోతులయ్య, సిరాజ్ హుస్సేన్ అరెస్ట్ చేసి విచారించారు. కేసు డైరీ కాలమ్ లోని జెండర్ కాలమ్ నింపుతుండగా సిరాజ్ తాను ఆడపిల్లనని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. సిరాజ్ తన అసలు పేరు షాబిన అస్మి అని, తమది కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామం అని చెప్పాడు. మూడేళ్ల క్రితం ముంబైలోని ఆసుపత్రిలో లింగ మార్పిడి చేసుకున్నానని తెలిపాడు. సిరాజ్ మాటలతో పోలీసులు మరింత డైలామాలో పడ్డారు. నిజ నిర్ధారణ కోసం షాబిన అస్మి అలియాస్ సిరాజ్ కు వైద్య పరీక్షలు చేసి ఆడనా, మగనా అనే విషయం తేల్చాలని గాంధీ ఆసుపత్రి డాక్టర్లకు పోలీసులు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories