పోలీసులపై దాడి చేసి తప్పించుకున్న రౌడీషీటర్.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు !

పోలీసులపై దాడి చేసి తప్పించుకున్న రౌడీషీటర్.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు !
x
పోలీసులపై దాడి చేసి తప్పించుకున్న రౌడీషీటర్.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు !
Highlights

తమపై దాడి చేసి పారిపోతున్న రౌడీషీటర్ ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని గోల్కొండ పరిధిలోని మోతీమహల్‌ లో అబ్దుల్లా బిన్ అలీ అనే రౌడీ షీటర్...

తమపై దాడి చేసి పారిపోతున్న రౌడీషీటర్ ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని గోల్కొండ పరిధిలోని మోతీమహల్‌ లో అబ్దుల్లా బిన్ అలీ అనే రౌడీ షీటర్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అబ్దుల్లా ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులపై దాడి చేసి అబ్దుల్లా తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. తప్పించుకు పారిపోతున్న అబ్దుల్లాను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. రౌడీషీటర్ పై కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కేసుల్లో అబ్దుల్లా బిన్ అలీ నిందితుడిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories