విజయవాడలో దారుణం.. భార్యను చంపి ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు..

విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య తనకు విడాకులు ఇస్తోందన్న కోపంతో ఆమెను క్రూరంగా హత్య చేసి.. ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు ఓ వ్యక్తి.

K V D Varma
Published on: 11 Aug 2019 4:57 PM IST
విజయవాడలో దారుణం.. భార్యను చంపి ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు..
X

విజయవాడలో దారుణం జరిగింది. నగరంలోని సత్యనారాయణపురం సమీపంలోని శ్రీనగర్ కాలనీలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపాడు. భార్యను చంపిన అతను ఏకంగా ఆమె తలను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ప్రదీప్ అనే వ్యక్తికి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య వివాదాలు రావడం తో విడిపోయారు. భార్యభర్తలిద్దరూ చట్టబద్ధంగా విడిపోవాలని అనుకున్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. అయితే వీరి కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. త్వరలోనే కేసు విచారణ ముగియనుంది. దీంతో ఆమెపై భర్త పగపెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ భార్య సత్యనారాయణపురంలో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కిరాతకాన్ని చూసిన మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రదీప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


K V D Varma

K V D Varma

Next Story