అమెరికాలో యువతి అనుమానస్పద మృతి

అమెరికాలో యువతి అనుమానస్పద మృతి
x
Highlights

అమెరికాలో ఓ హైదరాబాద్ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నార్త్‌ కరోలినాలో ఘటన చోటుచేసుకుంది. నాగోల్ సమీపంలోని సాయినగర్ కు చెందిన గజం వనితకు...

అమెరికాలో ఓ హైదరాబాద్ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నార్త్‌ కరోలినాలో ఘటన చోటుచేసుకుంది. నాగోల్ సమీపంలోని సాయినగర్ కు చెందిన గజం వనితకు శివకుమార్ తో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం తర్వాత భర్తతో విభేదాలు, అత్తింటి వారి వేధింపులతో హైదరాబాద్ లో ని తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకుని గత జులైలో భర్త దగ్గరికి వెళ్లింది. రెండు నెలలుగా వనిత తల్లిదండ్రులు, బంధువులతో కాంటాక్ట్ లేదు. వనిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు శివకుమార్ మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. భర్త వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శివకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories