హైదరాబాద్‌లో దారుణం... ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం

హైదరాబాద్‌లో దారుణం... ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం
x
ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం
Highlights

తెలంగాణలో కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ ట్రాన్స్‌‌జెండర్‌పై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో...

తెలంగాణలో కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ ట్రాన్స్‌‌జెండర్‌పై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో బాధిత ట్రాన్స్ జెండర్ పోలీసులను ఆశ్రయించింది. బాచుపల్లికి చెందిన మహేష్ అనే ఆటోడ్రైవర్ మంగళవారం రాత్రి తన ఆటో ఎక్కిన ఓ ట్రాన్స్‌జెండర్‌పై లైంగిక దాడి చేయడానికి యత్నించాడు. ఎలాగోలా ఈ కామాంధుడి బారి నుంచి తప్పించుకుని ఆ బాధితురాలు మిగిలిన ట్రాన్స్‌జెండర్‌లకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ట్రాన్స్‌జెండర్‌లు మహేష్‌ను చితకబాది బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆ మృగాడిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories