Top
logo

దిశ కేసులో వెలుగు చూస్తున్న విషయాలు.. దిశ సెల్‌ఫోన్‌ పాతిపెట్టిన నిందితులు

దిశ కేసులో వెలుగు చూస్తున్న విషయాలు.. దిశ సెల్‌ఫోన్‌ పాతిపెట్టిన నిందితులు
X
Highlights

దిశ అత్యాచారం, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ సెల్‌ఫోన్‌ను నిందితులు పాతిపెట్టినట్లు...

దిశ అత్యాచారం, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ సెల్‌ఫోన్‌ను నిందితులు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. కేసులో కీలకంగా మారిన మొబైల్‌ ఫోన్‌ పాతిపెట్టిన ఘటనాస్థలాన్ని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన అర కిలో మీటర్‌ పరిధిలో దిశ మొబైల్‌, వస్తువులను పాతిపెట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తోంది.

దిశ అత్యాచారం, హత్య కేసులో వాడిన లారీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లారీలో ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే నిందితులు దిశపై అత్యాచారం చేసిన అనంతరం లారీలో ఆమెను తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం షాద్‌నగర్‌ వద్ద చాటన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.


Web TitleFacts are revealing in Disha case
Next Story