Top
logo

హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఓ వ్యక్తిని తాళ్లతో కట్టేసి..

హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఓ వ్యక్తిని తాళ్లతో కట్టేసి..
Highlights

హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. గత కొద్ది రోజులుగా కన్పించకుండా పోయిన ఈ గ్యాంగ్‌ మళ్లీ...

హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. గత కొద్ది రోజులుగా కన్పించకుండా పోయిన ఈ గ్యాంగ్‌ మళ్లీ పంజా విసిరింది. ఆ మధ్య పోలీసులు ఈ చెడ్డీగ్యాంగ్‌పై గట్టి నిఘా పెట్టడంతో వీరు ఎక్కడా చోరీలకు పాల్పడలేదు. దీంతో వీరి పీడ విరగడైందనుకున్న సమయంలో మళ్లీ నగరంలో చోరీలకు దిగారు.

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుంట్లూరు గ్రామ శివారులోని ఓ ఆశ్రమంలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్‌ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్‌ కిశోర్‌ స్వామీ అనే వ్యక్తిని తాళ్లతో కట్టేశారు. అనంతరం 11 తులాల బంగారు ఆభరణాలను 50 వేల నగదును దోచుకెళ్లారు. ఆరుగురు వ్యక్తులు వచ్చి తనను భయపెట్టి బంగారు, నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Next Story