నగరంలో రేవ్ పార్టీ ఫీవర్.. ఎఫైర్ పబ్బులో ఏం జరిగింది?

నగరంలో రేవ్ పార్టీ ఫీవర్.. ఎఫైర్ పబ్బులో ఏం జరిగింది?
x
నగరంలో రేవ్ పార్టీ ఫీవర్
Highlights

నగరంలో పబ్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. అశ్లీల నృత్యాలే పెట్టుబడిగా ఈవెంట్ మేనేజర్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి రేవ్‌ పార్టీలతో హల్‌చల్‌...

నగరంలో పబ్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. అశ్లీల నృత్యాలే పెట్టుబడిగా ఈవెంట్ మేనేజర్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి రేవ్‌ పార్టీలతో హల్‌చల్‌ చేస్తున్నారు. అసభ్య నృత్యాలతో యువతను పెడదారి పట్టిస్తున్నారు. కంపెనీలు సైతం తమ ఉద్యోగుల సంతోషం కోసం రేవ్‌ పార్టీ ఏర్పాటు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది.

హైదరాబాద్‌ జుబ్లీహిల్స్‌ ఎఫైర్ పబ్‌ రేవ్‌ పార్టీ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సిగ్నోవా ఫార్మా కంపెనీ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కంపెనీకి చెందిన ఉద్యోగులను ఆనందపరచడం కోసం రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది. రేవ్‌ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చాకచక్యంగా దాన్ని భగ్నం చేశారు.

ఫార్మా కంపెనీ ప్రతినిధుల కోసం ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ గౌడ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్‌ గౌడ్‌తో పాటు శ్రీనివాస్ రెడ్డి, మహ్మద్ మోనిని అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఎఫైర్ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్‌ పరారీలో ఉన్నారని తెలిపారు.

పోలీసుల దాడిలో 21 మంది యువతులు పట్టుబడ్డారు. ఒక్కొక్కిరికి 4వేల రూపాయలు చెల్లించి రేవ్‌ పార్టీకి తీసుకొచ్చినట్లు బాధితులు చెప్పారన్నారు. రేవ్‌ పార్టీలకు అనుమతించిన ఎఫైర్ పబ్ లైసెన్సు రద్దు చేయాలని అధికారులకు లేఖ రాసినట్లు డీసీపీ తెలిపారు. పబ్‌లలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories