Top
logo

తాజ్‌ బంజారా హోటల్‌కు రూ.12లక్షల ఎగ్గోట్టాడు ...

తాజ్‌ బంజారా హోటల్‌కు రూ.12లక్షల ఎగ్గోట్టాడు ...
X
Highlights

తాజ్ బంజారా హోటల్ లో రూమ్ తీసుకొని ఏకంగా 12లక్షల ఎగ్గోట్టాడు ఓ వ్యక్తి . అక్కిచెట్టి శంకర్‌ నారాయణ్‌ అనే...

తాజ్ బంజారా హోటల్ లో రూమ్ తీసుకొని ఏకంగా 12లక్షల ఎగ్గోట్టాడు ఓ వ్యక్తి . అక్కిచెట్టి శంకర్‌ నారాయణ్‌ అనే వ్యక్తి గత నాలుగు నెలల క్రితం వ్యాపార లావాదేవీల కోసం హైదరాబాదు వచ్చాడు . తానూ చాలా రోజులు ఇక్కడే ఉంటానని చెప్పాడు . దీనితో అతనికి హోటల్ సిబ్బంది ఓ రూమ్ ని కేటాయించారు . అతను మొత్తం 102 రోజులు అ హోటల్ లో గడిపాడు . అతడు ఉన్నన్ని రోజులకు గాను రూ.25,96,693 బిల్లు అయింది . అయితే అందులో మధ్యలో రూ.13,62,149 చెల్లించాడు. ఇంకా రూ.12లక్షలు చెల్లించాల్సి ఉండగా అతను కనిపించకుండా పోయాడు. దీనితో హోటల్ సిబ్బంది అతనిని ఫోన్ లో సంప్రదించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది . దీనితో హోటల్ జనరల్ మేనేజర్ హితేంద్ర శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

Next Story