ప్రేమ పేరుతో రెండో పెళ్లి చేసుకున్న జవాన్ ... మొదటి భార్యకి విషయం తెలిసి

ప్రేమ పేరుతో రెండో పెళ్లి చేసుకున్న జవాన్ ... మొదటి భార్యకి విషయం తెలిసి
x
Highlights

అతడో ఆర్మీ జవాన్ ... అతడికి పెళ్లైంది. ఓ ఏడేళ్ళ కూతురు కూడా ఉంది. ఇవి చాలవు అన్నట్టుగా మరో యువతీని ప్రేమించాడు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ...

అతడో ఆర్మీ జవాన్ ... అతడికి పెళ్లైంది. ఓ ఏడేళ్ళ కూతురు కూడా ఉంది. ఇవి చాలవు అన్నట్టుగా మరో యువతీని ప్రేమించాడు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో తన భర్తను తన వెంట తీసుకోని వెళ్ళిపోయింది. దీనితో యువతీ అతడి చేతిలో మోసపోయాను అని తెలుసుకొని పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌‌లో చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సురపం రమేశ్ (29) అనే వ్యక్తీ ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 8 ఏళ్ల కిందట సొంత జిల్లాకే చెందిన మహిళతో వివాహమైంది. ఈ దంపతులకు ఏడేళ్ల కూతురు ఉంది. అయితే 2018లో స్థానికంగా నివాసం ఉండే ఓ యువతి (22)తో రమేశ్ కి పరిచయం ఏర్పడింది. ఆమెను రమేష్ ఎవరికీ తెలియకుండా గుడిలో వివాహం చేసుకున్నాడు.

ఈ నేపద్యంలో విధులకు వెళ్లి సెలవులపై ఇంటికి రావాల్సిన భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య తన బంధువులతో కలిసి విషయం తెలుసుకుంది. రెండో పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో భర్తని , యువతిని నిలదీసింది. అనంతరం భర్తను తన వెంట తీసుకెళ్లిపోయింది. దీనితో ఆ వ్యక్తి చేతిలో మోసపోయాను అని తెలుసుకున్న యువతీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories