logo
సినిమా

యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌య‌న్‌

యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌య‌న్‌
X
Highlights

తెలుగులో 'మ‌యూరి'గా వ‌చ్చిన త‌మిళ చిత్రం 'మాయ'.. కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార కెరీర్ గ్రాఫ్‌నే మార్చివేసింది. న‌య‌న్ ...

తెలుగులో 'మ‌యూరి'గా వ‌చ్చిన త‌మిళ చిత్రం 'మాయ'.. కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార కెరీర్ గ్రాఫ్‌నే మార్చివేసింది. న‌య‌న్ 'లేడీ సూప‌ర్‌స్టార్ 'అని పిలిపించుకోవ‌డానికి ఈ సినిమా కూడా ఓ కార‌ణంగా నిలిచింది. ఈ చిత్రం త‌రువాత 'డొర'తో పాటు 'అర‌మ్' త‌దిత‌ర హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన న‌య‌న‌తార‌.. తాజాగా మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంత‌కం చేసింది.

అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఆది పినిశెట్టి హీరోగా వ‌చ్చిన త‌మిళ అనువాద చిత్రం 'వైశాలి'ని డైరెక్ట్ చేసింది కూడా ఈ ద‌ర్శ‌కుడే. ఈ సినిమాతో న‌య‌న్ రేంజ్ మ‌రో స్థాయికి వెళుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. తెలుగులో చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి', బాల‌కృష్ణ 102వ చిత్రంలో న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Next Story