రికార్డు కొట్టిన 'మెర్స‌ల్‌'

రికార్డు కొట్టిన మెర్స‌ల్‌
x
Highlights

త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టించిన ఈ...

త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి 'రాజా రాణి' ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో విడుద‌ల కానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది.
ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు అట్లీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిన్న సాయంత్రం 6 గంట‌ల‌కు 'మెర్స‌ల్' త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్ విడుద‌లైంది. క‌ట్ చేస్తే.. ఇప్ప‌టికే 10 మిలియ‌న్లకి పైగా వ్యూస్‌ని పూర్తిచేసుకుంది. ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌.జె.సూర్య ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. 'మెర్స‌ల్' 10 మిలియ‌న్ల వ్యూస్‌ని దాటేసింది. ఇదొక ప్ర‌పంచ రికార్డ్ అంటూ చెప్పుకొచ్చారు. టీజ‌ర్ లాగే సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories