logo
సినిమా

జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత కాద‌ట‌

జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత కాద‌ట‌
X
Highlights

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బ‌యోపిక్ తీస్తున్నాన‌ని.. దానికి 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' అనే పెడుతున్నాన‌ని...

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బ‌యోపిక్ తీస్తున్నాన‌ని.. దానికి 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' అనే పెడుతున్నాన‌ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి ప్ర‌ముఖ న‌టుడు జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడని తాజాగా వార్త‌లు వినిపించాయి.

అయితే అందులో వాస్త‌వం లేద‌ని స్వ‌యంగా వ‌ర్మ‌నే చెప్పుకొచ్చాడు. త‌న ఫేస్ బుక్ పేజీలో ఈ విష‌యాన్ని ఆయ‌న తెలియ‌జేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వ‌తి పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టించ‌నున్నారు, ఈ సినిమాకి ఎవ‌రు నిర్మాత‌గా వ్య‌వ‌హారించ‌నున్నారు అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు.

Next Story