విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఎయిర్ షో

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఎయిర్ షో
x
Highlights

విజయవాడ మరో భారీ వేడుకకు వేదిక కాబోతుంది. ఈ నెల 23 నుంచి 25 వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో బెజవాడలోని పున్నమిఘాట్ లో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఒకేసారి...

విజయవాడ మరో భారీ వేడుకకు వేదిక కాబోతుంది. ఈ నెల 23 నుంచి 25 వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో బెజవాడలోని పున్నమిఘాట్ లో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఒకేసారి నాలుగు విమానాలు ఆకాశంలో చేసే అద్భుత విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఇటీవల F1H2O రేసులను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడంతో విజయవాడకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. మరో భారీ కార్యక్రమం నిర్వహించేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది. బెజవాడలో ఎయిర్ షో నిర్వహించనున్నారు.

ఎయిర్ షో నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన నాలుగు విమానాలు గన్నవరంలో ఎయిర్ పోర్ట్ లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి 25 వరకు విజయవాడలోని పున్నమిఘాట్ లో ఎయిర్ షో ఉంటుంది. ప్రతి రోజు రెండు పూటల ఎయిర్ షో నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు , సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ఆకాశంలో విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. ఈ ఎయిర్ షో ను ఈ నెల 23న మంత్రి అఖిల ప్రియా ప్రారంభిస్తారు. ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఎయిర్ షో ను చూసేందుకు బెజవాడవాసులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories