మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన కెసిఆర్ ప్రభుత్వం

మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన కెసిఆర్ ప్రభుత్వం
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పేరుతో బాలికలకు ఉచిత వస్తువులను అందించనుంది. దేశం లోనే మొదటి...

తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పేరుతో బాలికలకు ఉచిత వస్తువులను అందించనుంది. దేశం లోనే మొదటి సారిగా బాలికల కోసం తయారు చేసిన ప్రత్యేక కిట్ ను అందించనుంది. సంవత్సరానికి వంద కోట్ల బడ్జెట్ తో రాష్ట్రంలో ఉన్నదాదాపు ఆరు లక్షల మంది విద్యార్దినులు లబ్ది పొందే విదంగా రూపొందించిన ఈ పథకాన్ని లేడి గవర్నర్ విమలా నరసింహన్ ప్రారంభించారు.

బంగారు తెలంగాణ సాదన కోసం ముందుగా ఆరోగ్య తెలంగాణ సాదించాలంటుంది రాష్ట్ర ప‌్రభుత్వం. అందుకోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాల ను తెలంగాణలో తీసుకు వస్తున్నారు. తాజాగా రాష్ట్ర్ర వ్యాప్తంగా 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

గతంలోనే ఈ పథకం తీసుకు రావాలని చూసినా కొన్ని అవాంతర కారణాల తో ఆగిపోయింది. అయినప్పటికినీ దేశంలోని విద్యార్థినిల ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించడానికి ఏకైక రాష్ట్రం గా తెలంగాణ ముందుకు వచ్చింది. విద్యార్థినిలకు నెలసరి రావడం వల్ల ఆరోగ్యపరంగా బలహీనమవుతున్నారని, పాఠశాలలకు కూడా రాకపోవడం వల్ల విద్యాపరంగా వెనుకబడుతున్నట్లు కేంద్రం నియమించిన క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ నిర్దారించింది. దీనికి పరిష్కారంగానే ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. తమకు ఈ కిట్లు అందడంతో స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగ పడే ఈ కిట్ల విద్యార్దునులు సంతోష్ వ్యక్తం చేస్తున్నారు. లేడి గవర్నర్ విమలా నరసింహన్ చేతుల మీదుగా రాజ్ భవన్ స్కూలు లో ప్రారంభమయిన ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories