అదే పాక్ అదే అబద్దం

అదే పాక్ అదే అబద్దం
x
Highlights

ఉగ్రవాద దేశమన్న కారణంగా ప్రపంచమంతా ఏకాకిని చేసినా పాకిస్థాన్ పాపపు బుద్ధి మారటం లేదు. తమ చెరలో బందీగా ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ తో అవాకులూ,...

ఉగ్రవాద దేశమన్న కారణంగా ప్రపంచమంతా ఏకాకిని చేసినా పాకిస్థాన్ పాపపు బుద్ధి మారటం లేదు. తమ చెరలో బందీగా ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ తో అవాకులూ, చవాకులు మాట్లాడించి మరో వీడియోను విడుదల చేసింది. కులభూషణ్ తో భారత్ ను తిట్టించింది. అబద్ధాల పాకిస్థాన్ మరో పాపానికి ఒడిగట్టింది.. తమ కస్టడీలో ఉంచుకున్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ చేత ఇష్టాను సారం మాట్లాడిస్తోంది.. భారత్ ను తిట్టిస్తోంది. చేయని నేరాన్ని చేశానని ఒప్పిస్తోంది. రాసిచ్చిన స్క్రిప్టును చదివించి.. దానిని షూట్ చేసి ఆ అధికారి అభిప్రాయంగా చూపిస్తోంది. పాకిస్థాన్ లో కులభూషణ్ తల్లిని, భార్యను కలసిన తర్వాత పాక్ విడుదల చేసిన తొలి వీడియో ఇదే. పాకిస్థాన్ అధికారుల కస్టడీలో తాను చాలా స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పించింది. తన భార్యను, తల్లిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు కులభూషణ్ పాకిస్థానీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాడు.. తమ భేటీ చాలా ఆహ్లాదంగా సాగిపోయిందని.. తనను చూసినందుకు తన తల్లి సంతోషించిందని జాదవ్ తెలిపినట్లుగా ఆ వీడియోలో ఉంది.

తనను కలసినందుకు చాలా ఆనందంగా ఉందని తన తల్లి చెప్పిందని, తనను చూశాక ఆ మనసు స్థిమితపడిందని కామెంట్ చేసినట్లు జాదవ్ తెలిపాడు. నాగురించి బెంగ వద్దు పాకిస్థానీ ప్రభుత్వం నన్ను జాగ్రత్తగానే చూసుకుంటోంది నాకెలాంటి హానీ వాళ్లు తలపెట్టలేదు కనీసం నన్ను ముట్టుకోలేదు అని జాదవ్ ఆ వీడియోలో చెప్పాడు. అలాగే భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఒక ముఖ్య విషయం అంటూ కులభూషణ్ కొనసాగించాడు. తాను మాజీని కానని కమిషన్డ్ నేవీ అధికారిననీ, తన కమిషన్ తొలగించలేదని తెలిపాడు తన తల్లిని, భార్యను కలసినప్పుడు వారి కళ్లలో భయాన్ని చూశానని, భయపడొద్దని, జరిగిందేదో జరిగిపోయిందనీ వారికి దిగులు అనవసరమనీ భూషణ్ చెప్పాడు.

నల్లటి కోటు వేసుకుని వీడియో స్క్రీన్ పై కులభూషణ్ కనిపించాడు ఆ ముఖంలో ఎక్కడా నవ్వు లేదు పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న భావన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కులభూషణ్ స్పీచ్ అంతటితో ఆగలేదు.. నా తల్లి, భార్య భేటీ ముగించుకుని బయటకువస్తుండగా భారతీయ రాయబారులు వారిపై గట్టిగా అరిచారు వారిపై ఎందుకు నోరు చేసుకుంటున్నారు అని ప్రశ్నించాడు. కులభూషణ్ డిసెంబర్ 25న పాకిస్థాన్ లో తన తల్లి, భార్యను కలుసుకున్నాడు ఈ భేటీని భారత రాయబారి కొంత దూరంనుంచి చూసే అవకాశం కల్పించారు. మహమ్మద్ ఆలీ జిన్నా జయంతి సందర్భంగా మానవతా దృక్పథంతోనే ఈ అవకాశం కల్పించినట్లు పాకిస్థాన్ గొప్ప లు చెప్పుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories