క్రూడాయిలు ధరలు 'మైనస్' లోకి.. చరిత్రలో తొలిసారి!

క్రూడాయిలు ధరలు మైనస్ లోకి.. చరిత్రలో తొలిసారి!
x
oil rig (file image)
Highlights

ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా క్రూడాయిల్ ధరలు కనిష్టం కాదు.. కాదు.. సున్నా కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. కరోనా ఎఫెక్టు తో ప్రపంచమంతా దాదాపు...

ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా క్రూడాయిల్ ధరలు కనిష్టం కాదు.. కాదు.. సున్నా కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. కరోనా ఎఫెక్టు తో ప్రపంచమంతా దాదాపు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఆయిల్ డిమాండ్ కూడా ఊహించని విధంగా పడిపోయింది. ఆ దెబ్బకి West Texas Intermediate (wti) రకం క్రూడాయిలు ధరలు కకావికలం అయిపోయాయి.

WTI క్రూడాయిలు క్రూడ్ మే ఫ్యూచర్స్ ధర సోమవారం రాత్రి మైనస్ 38 శాతానికి పడిపోయింది. భవిష్యత్ ధరలను నిర్దేశించే క్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్స్ ధర నిర్ణయిస్తారు. క్రూడాయిలు ఉత్పత్తి కంటే దానిని నిలువ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయిల్ డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ఆ ప్రభావం మేనెల ఫ్యూచర్ ట్రేడింగ్ మీద పడింది. ఈ ధరల్లో మార్పులు రావచ్చు. కానీ, ధరలు ఇలా మైనస్ స్థాయికి పడిపోవడం మాత్రం ఇదే తొలిసారి. దీని ప్రభావంతో వందలాది అమెరికన్ ఆయిల్ కంపెనీలు దివాలా బాట పట్టాయని తెలుస్తోంది. ఈ ధరల పతనం ప్రభావం అమెరికా ఆర్ధిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినడం అంటే పలు దేశాల స్టాక్ మార్కెట్లు కూడా కుదేలు అయిపోయే చాన్స్ ఉన్నట్టే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

కరోనా ప్రజల ఆరోగ్యాలను మాత్రమే కాదు ఆర్ధిక స్థితి గతులనూ గల్లంతు చేసేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories