బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. వెండి ధరలూ కాస్త పెరిగాయి!
బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (11.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 10 రూపాయల స్వల్ప పెరుగుదల నమోదు చేసి 40,150 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 10 రూపాయల స్వల్ప పెరుగుదలతో 43,910 రూపాయలు నమోదు చేసింది.
కొద్దిగా పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 10 రూపాయల స్వల్పపెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కుకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,000 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 10 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,150 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 10 రూపాయల పెరుగుదలతో 43,910 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,000 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో..
ఢిల్లీలో బంగారం ధరలు అదేవిధంగా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయల పెరుగుదలతో 44,260 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 10 రూపాయల పెరుగుదలతో 42,290 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాదకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,000 రూపాయల వద్దనిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




