Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్ ,డీజిల్ ధరలు

Petrol Rate: ఎన్నికల నేపథ్యంలో గత 13 రోజులుగా నిలకడగా ఇంధనధరలు * ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలు

Sandeep Eggoju
Published on: 12 April 2021 9:38 AM IST
Petrol Price Stable in Indian Metro Cities
X

Representational Image

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత 13 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచరాదన్న సూచనల మేరకు ఇంధన సరఫరా సంస్థలు ధరలను నిలకడగా కొనసాగిస్తున్నాయన్న వాదనలు వినవస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి..మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story