Petrol Rate: గత వారం రోజులుగా నిలకడగా ఇంధన ధరలు

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ,డీజిల్ ధరలు స్థిరం

Sandeep Eggoju
Published on: 22 April 2021 10:16 AM IST
Petrol Price is Stable From the Last one Week 22-04-2021
X

Representational Image

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 93.99 వద్ద, డీజిల్ ధర 88.05 వద్ద నిలకడగా వున్నాయి. ఇక విజయవాడలోనూ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 96.52 వద్ద ,డీజిల్ ధర 90.04 వద్ద నిలకడగా వున్నాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 40 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 73 పైసలు వద్దకి చేరింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోరూ ఇంధన ధరలు క్రమంగా పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో అంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు పైకి కదలడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story