SBI ఖాతాదారులకు ఈరోజు నుంచి కొత్త రూల్స్!
అక్టోబర్ నెలలో ఎస్బీఐ కొన్ని రకాల డిపాజిట్ల పై వడ్డీలను సవరిస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాలు ఈ రోజు నుంచి అంటే నవంబర్ 1 అమల్లోకి రాబోతున్నాయి. ఇవి బ్యాంకు ఖాతాదారులపై నేరుగా ప్రభాం చూపిస్తాయి. అవేంటో తెలుసుకుందామా..
వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉన్నందువల్ల రిటైల్ సేవింగ్స్ ఎకౌంట్ల పై వడ్డీ రేటు తగ్గిస్తున్నట్టు చెప్పింది. ఆ మేరకు లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో, ఇప్పుడు ఈ అకౌంట్లపై 3.5 శాతం కాకుండా 3.25 శాతం వడ్డీ లభిస్తుంది. లక్షకు పైగా ఉన్న ఎకౌంట్లకు ఇది వర్తించదు. సాధారణంగా బ్యాంకులో లక్ష రూపాయల లోపు డిపాజిట్లే ఎక్కువ ఉంటాయి. అందువల్ల లక్ష రూపాయలకు పైగా డిపాజిట్ చేసిన వారి అకౌంట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా 3 శాతం వడ్డీ రేటే వస్తుంది.
అదేవిధంగా కస్టమర్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటును వసూలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రూ.50 కోట్లకు పైన టర్నోవర్ ఉన్న కంపెనీలకు డిజిటల్ లావాదేవీలు వ్యయాన్ని తగ్గిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కూడా ఈ రోజు నుంచే అమలులోకి రానుంది.


