లాభాల్లో దేశీ స్టాక్‌ మార్కెట్లు

* సెన్సెక్స్‌ 550 పాయింట్ల లాభం, నిఫ్టీ 16 వేల మార్కుకు చేరువ * దశాబ్దకాలంలోనే అత్యుత్తమ వారం వారీ లాభాలు * తాజావారం తొలి సెషన్‌లోనూ అదే దూకుడు

Sandeep Eggoju
Published on: 8 Feb 2021 10:03 AM IST
Indian Stock Markets Are in Profits
X

Representational Image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. దశాబ్దకాలంలోనే అత్యుత్తమ వారం వారీ లాభాలు గత వారంలో నమోదు చేసిన దేశీ స్టాక్ సూచీలు తాజావారం తొలి సెషన్ లోనూ అదే దూకుడు చూపుతున్నాయి. ఆర్థిక రికవరీపై పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలకు తోడు గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లోనే బీఎస్ఈ సెన్సెక్స్‌ 550 పాయింట్ల లాభాన్ని నమోదు చేయగా అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 16 వేల మార్కుకు చేరువవుతూ సరికొత్త రికార్డులను లిఖిస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story