Gold Rate: రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

K V D Varma
Updated on: 31 March 2020 8:02 AM IST
Gold Rate: రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!
X

గత వారం అంతా పరుగులు తీసిన బంగారం వరుసగా రెండో రోజూ కిందకు దిగివచ్చింది. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు (మార్చి,31) తగ్గాయి. పది గ్రాముల బంగారం దాదాపు 400 రూపాయల వరకూ తగ్గుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర మార్పులు లేకుండా నిలకడగా నిలిచింది.

బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (31.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,520 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 210 రూపాయల తగ్గుదలతో 43,175 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం నిలకడగా నిన్నటి ధరల వద్దే నిలిచాయి. వెండి ధర కేజీకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. దీంతో 40 వేల మార్కు కంటే దిగువనేకేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,500 రూపాయల వద్దనిలిచింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,520 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 210 రూపాయల తగ్గుదలతో 43,175 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా నిలకడగా ఉన్నాయి. వెండి ధర 39,500 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 420 రూపాయల తగ్గుదలతో 43,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల తగ్గుదలతో 41,020 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా మార్పులు లేకుండా నిన్నటి ధరల వద్దే నిలిచాయి. 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,500 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story