భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. పరుగులు తీసిన వెండి ధరలు

K V D Varma
Updated on: 31 Jan 2020 1:14 PM IST
భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. పరుగులు తీసిన వెండి ధరలు
X

రెండు రోజులుగా తగ్గినట్టు కనిపించిన బంగారం శుక్రవారం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. నిన్న భారీ తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు (31.01.2020) భారీగా పెరిగింది. ఒక పక్క పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం డిమాండ్ పెరిగింది. మరోపక్క అంతర్జాతీయంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇంకోవైపు చైనాలో కరోనా వైఅరాస్అం కలకలం కూఅడా బంగారంపై ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితిపై కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తున్న నేపధ్యంలో..ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం అని భావించడంతో బంగారం కొనుగోళ్ళు పెరిగాయి. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగసాయి.

భగ్గుమన్న బంగారం..


మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక్కసారిగా 510రూపాయలు పెరిగిపోయింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,900 నుంచి 42,410 రూపాయలకు ఎగబాకింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 500 రూపాయలు పెరగడంతో 38,380 నుంచి 38,880 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు పసిడిని మించి పరుగులు..


ఒకవైపు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేయగా.. వెండి ధరలు కూడా బగారాన్ని మించి పరుగులు తీశాయి. ఒక్కసారిగా కేజీకి 610 రూపాయలు వెండి ధర పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 49,810 రూపాయల వద్దకు ఎగశాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,410 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,880 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,810 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..


కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు భగ్గుమన్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 450 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 500 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,700 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,810 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31.01.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


K V D Varma

K V D Varma

Next Story