స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
నిన్న కొంతవరకూ తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. ఈరోజు (ఏప్రిల్ 29) బంగారం ధరలు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబద్ లో పెరుగుదల కనబరచిన బంగారం డిల్లీ మార్కెట్లో మాత్రం ఒక్కసారిగా కిందికి దిగొచ్చాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు అత్యంత స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (30.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 180 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,420 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం పది గ్రాములకు 190 రూపాయల పెరుగు దలతో 47,190 రూపాయలు నమోదు చేసింది.
కాస్త తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కేజీకి 10 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే కిందికి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,510 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం ధర కంటే 180 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,420 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 190 రూపాయల పెరుగుదలతో 47,190 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,510 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు భారీ తగ్గుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1230 రూపాయల తగ్గుదలతో 47,020 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కసారిగా 810 రూపాయల తగ్గుదలతో 45,340 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరియి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 41,510 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




