Gold Rate: దిగివచ్చిన బంగారం ధరలు..పైకెగసిన వెండి ధరలు..ఈరోజు ఇలా!

Gold Rate: నిన్న పైకెగసిన బంగారం ధరలు ఈరోజు అదేస్థాయిలో కిందికి దిగోచ్చాయి. ఇక వెండి ధరలు పెరిగాయి.

K V D Varma
Published on: 29 Aug 2020 6:49 AM IST
Gold Rate: దిగివచ్చిన బంగారం ధరలు..పైకెగసిన వెండి ధరలు..ఈరోజు ఇలా!
X

Gold rate today

నిన్న పైకెగసిన బంగారం ధరలు ఈరోజు దాదాపుగా అదేస్థాయిలో కిందికి దిగోచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి.. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 29) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం మళ్ళీ పైకెగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. శనివారం (29.08.2020) బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 510 రూపాయలు తగ్గి 49,240 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 550 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,720 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పైపైకి..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 800 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,300 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 510 రూపాయలు తగ్గి 49,240 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 550 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,720 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ధర కంటె 700 రూపాయలు తగ్గింది. దీంతో 49,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ధర కంటె 760 రూపాయలు తగ్గింది. దాంతో 54,440 రూపాయలకు దిగివవ్చింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 800 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,300 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story