Gold Rate: పైపైకి కదిలిన బంగారం ధరలు..స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..లేటెస్ట్ రెట్లివే!

Gold Rate: వరుసగా తగ్గుతూ వస్తూ ఊరట కలిగించిన బంగారం ధరలు మళ్ళీ పైకేగాశాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది.

K V D Varma
Published on: 28 Aug 2020 6:44 AM IST
Gold Rate: పైపైకి కదిలిన బంగారం ధరలు..స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..లేటెస్ట్ రెట్లివే!
X

Gold rate today

వరుసగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు షాకిచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 28) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. శుక్రవారం (28.08.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 560 రూపాయలు పెరిగి 49,750 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 610 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,660 రూపాయల వద్ద నిలిచింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు ..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయి వద్దే వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 65,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 560 రూపాయలు పెరిగి 49,750 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 610 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,660 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త పైకి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ధర కంటె 750 రూపాయలు పెరిగింది. దీంతో 50,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధర కంటె 820 రూపాయలు పెరిగింది. దాంతో 55,200 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయి వద్దే వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 65,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story