Top
logo

Gold rate Today: స్వల్పంగా దిగొచ్చిన బంగారం..రెండోరోజూ వెండి ధరలు తగ్గాయి!

Gold rate Today: స్వల్పంగా దిగొచ్చిన బంగారం..రెండోరోజూ వెండి ధరలు తగ్గాయి!
Highlights

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో రెండురోజులు వరుసగా పెరుగుదల నమోదు చేసిన బంగారం.. రెండురోజులు ...

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో రెండురోజులు వరుసగా పెరుగుదల నమోదు చేసిన బంగారం.. రెండురోజులు తాగ్గుతూ వచ్చింది. మళ్ళీ నిన్న భగ్గుమంది. అయితే, ఈరోజు బంగారం ధర మళ్ళీ కిందకు దిగొచ్చింది. బంగారం ధరలు ఈరోజు ఓ మోస్తరు తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు కొద్దిగా తగ్గయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 140 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,550 రూపాయల నుంచి 44,410 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో తగ్గుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 110 రూపాయలు తగ్గింది. దీంతో 40,820 రూపాయల నుంచి 40,710 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగివచ్చింది.

మరికాస్త తగ్గిన వెండి ధరలు..

బంగారం ధర తో పాటు వెండి ధరలు కూడా వరుసగా రెండోరోజూ కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో శనివారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 30 రూపాయలు తగ్గి 49,౬౪00 రూపాయల నుంచి 49,570 రూపాయలకు తగ్గింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 44,410 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 40,710 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 30 రూపాయలు తగ్గింది. దీంతో కెజీ వెండీ 49,570 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,800 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసి 41,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా కాస్త తగ్గింది. దీంతో కేజీ వెండి 49,570 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Web Titlegold-rate-today-29-02-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi
Next Story


లైవ్ టీవి