Gold Rate: మరింత పైకి బంగారం ధరలు.. ఇంకొంచెం కిందికి వెండి ధరలు !

K V D Varma
Published on: 28 March 2020 7:38 AM IST
Gold Rate: మరింత పైకి బంగారం ధరలు.. ఇంకొంచెం కిందికి వెండి ధరలు !
X

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. ఎదురోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఎనిమిదోరోజూ మరి కొంచం పైకెగాశాయి. స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు 500 రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గుదల వైపు నడిచింది. కేజీ వెండి 90 రూపాయల మేర దిగివచ్చింది.

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (28.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 510 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,770 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 490 రూపాయల పెరుగుదలతో 45,300 రూపాయలు నమోదు చేసింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి 90 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,410 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 510 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,770 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 490 రూపాయల పెరుగుదలతో 45,300 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. వెండి ధర 41,410 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1950 రూపాయల పెరుగుదలతో 45,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 510 రూపాయల పెరుగుదలతో 42,560 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 41,410 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story