Gold Rate Today: పైకెగసిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు!

K V D Varma
Updated on: 28 Feb 2020 12:12 PM IST
Gold Rate Today: పైకెగసిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు!
X

నిన్న మొన్నా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ పై చూపులు చూశాయి. బంగారం ధరలు ఈరోజు ఓ మోస్తరు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో శుకరవారం బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 210 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,340 రూపాయల నుంచి 44,550 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 210 రూపాయలు పెరిగింది. దీంతో 40,610 రూపాయల నుంచి 40,820 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర ఎగబాకింది.

కాస్త తగ్గిన వెండి ధరలు..

బంగారం ధర పై పైకి కదిలితే, వెండి ధరలు మాత్రం కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో శుక్రవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 200 రూపాయలు తగ్గి 49,800 రూపాయల నుంచి 49,600 రూపాయలకు తగ్గింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 44,550 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 40,820 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 200 రూపాయలు తగ్గింది. దీంతో కెజీ వెండీ 49,600 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,900 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసి 41,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా కాస్త తగ్గింది. దీంతో కేజీ వెండి 49,600 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story