ఈరోజూ బంగారం ధరలు పెరిగాయి..వెండి ధరలూ పైపైకి!

K V D Varma
Published on: 27 April 2020 7:13 AM IST
ఈరోజూ బంగారం ధరలు పెరిగాయి..వెండి ధరలూ పైపైకి!
X
gold and silver rate

బంగారం ధరలు ఈరోజూ పైకెగశాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయంగానూ పడింది. ఈరోజు (ఏప్రిల్ 27) బంగారం ధరలు పది గ్రాములకు 120 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు నిన్న కిందకి దిగిన వెండి ధరలు ఈరోజు పై చూపులు చూశాయి. కేజీకి 70 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు పై పైకి కదిలాయి. సోమవారం (27.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 120 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,620 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు120 రూపాయల పెరుగుదలతో 45,930 రూపాయలు నమోదు చేసింది.

పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా, వెండి ధరలు కూడా అదే దారిలో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. వెండి ధర ఈరోజు కూడా పెరిగిపోయింది. కేజీకి 70 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 42,600 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం ధర కంటే120 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,620 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు120 రూపాయల పెరుగుదలతో 45,930 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 42,600 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయల పెరుగుదలతో 46,030 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయల పెరుగుదలతో 43,120 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 42,600 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story