Gold Rate: నాలుగు రోజుల తరువాత పైకెగసిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు! తాజా ధరలివే!

Gold Rate: నలుగు రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి.. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి శనివారం భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

K V D Varma
Published on: 26 Sept 2020 7:57 AM IST
Gold Rate: నాలుగు రోజుల తరువాత పైకెగసిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు! తాజా ధరలివే!
X

నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పై చూపులు చూశాయి. బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే కొద్దిగా పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 26) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు భారీస్థాయిలో పెరుగుదల నమోదు చేసి షాకిచ్చాయి!

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (26.09.2020) బంగారం ధరలు శుకరవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 48,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 500 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,370 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు భారీ పెరుగుదల!

బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు అమాంతం పైకెగసి షాక్ ఇచ్చాయి.. వెండి ధరలు భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటే బాగా పెరిగాయి. ఈరోజు 2300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 59,300 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.శనివారం (26.09.2020) బంగారం ధరలు శుకరవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 48,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 500 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,370 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 450 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 450 రూపాయలు పెరిగింది. దాంతో 53,190 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. వెండి ధరలు అమాంతం పైకెగసి షాక్ ఇచ్చాయి.. వెండి ధరలు భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటే బాగా పెరిగాయి. ఈరోజు 2300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 59,300 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story