Gold Rate: వరుసగా నాలుగోరోజూ మరింత తగ్గిన బంగారం ధరలు.. కొనసాగుతున్న వెండి ధరల పతనం! ఈరోజు రేట్లిలా!

Gold Rate: బంగారం ధరలు మరింత కిందికి దిగివస్తున్నాయి. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేసింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

K V D Varma
Published on: 25 Sept 2020 7:25 AM IST
Gold Rate: వరుసగా నాలుగోరోజూ మరింత తగ్గిన బంగారం ధరలు.. కొనసాగుతున్న వెండి ధరల పతనం! ఈరోజు రేట్లిలా!
X

gold rate today 

తగ్గుదల బాటలోనే బంగారం ధరలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు కిందికి దిగొచ్చాయి. బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే మరింత తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 25) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (25.09.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 47,550 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 600 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,870 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు మరింత కిందికి దిగివచ్చాయి. వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు 2000 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 57 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 57,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.శుక్రవారం (25.09.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 47,550 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 600 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,870 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 650 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 720 రూపాయలు తగ్గింది. దాంతో 52,740 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు 2000 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 57 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 57,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story