Gold Rate: వరుసగా ఆరో రోజూ భారీగా పెరిగిన బంగారం.. వెండి పరుగులు!!

Gold Rate: వరుసగా ఆరో రోజూ భారీగా పెరిగిన బంగారం.. వెండి పరుగులు!!
x
Highlights

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. ఐదురోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆరోజైన ఈరోజు మరి కొంచం పైకెగాశాయి. భారీ పెరుగుదలను నమోదు చేశాయి. పది...

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. ఐదురోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆరోజైన ఈరోజు మరి కొంచం పైకెగాశాయి. భారీ పెరుగుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు 1000 రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర కూడా భారీ పెరుగుదల వైపు నడిచింది. ఏకంగా కేజీ వెండి 790 రూపాయల మేర పెరిగి షాక్ ఇచ్చింది.

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (26.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 1010 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,080 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 1010 రూపాయల పెరుగుదలతో 44,630 రూపాయలు నమోదు చేసింది.

భారీగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరిగితే, అదే దారిలో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. వెండి ధర కేజీకి 790 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,810 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 1010 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,080 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1010 రూపాయల పెరుగుదలతో 44,630 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. 41వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 41,810 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1010 రూపాయల పెరుగుదలతో 43,070 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1010 రూపాయల పెరుగుదలతో 41,870 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 41,810 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories