Gold Rate: భగ్గుమంటున్న బంగారం! కాస్త తగ్గిన వెండి!

Gold Rate: బంగారం భగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు కాస్త ఉపశమించింది

K V D Varma
Published on: 25 July 2020 6:57 AM IST
gold and silver rate today 25th july
X
gold rate today

బంగారం భగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు కాస్త ఉపశమించింది. ఇక నిన్న తలుచుకోవడానికీ భయపడే విధంగా ఎగసిన వెండి ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల కనబర్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 25) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరల రికార్డు పరుగులకు బ్రేకు పడింది.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (25.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 640 రూపాయలు పెరిగింది. దీంతో 48,790 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 720 రూపాయలు పెరిగింది. దీంతో 53 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 52,220 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరల మోత!

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వరుసగా పెరుగుతూ వస్తున్నా వెండి ధరలుకు కాస్త బ్రేక్ పడింది. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే కొద్దిగా తగ్గింది. ఈరోజు 950 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 61,050 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 640 రూపాయలు పెరిగింది. దీంతో 48,790 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 720 రూపాయలు పెరిగింది. దీంతో 53 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 52,220 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 550 రూపాయలు పెరిగి 49,550 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధరతో పోలిస్తే 550 రూపాయలు పెరిగింది. దీంతో 50,750 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 60 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,050 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story