Gold Rate: ఆగని బంగారం పరుగులు.. మరింతగా వెండి దూకుడు!

Gold Rate: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది.

K V D Varma
Published on: 24 July 2020 8:26 AM IST
gold and silver rate today 24th July
X
gold rate today

బంగారం భగ భగలు ఆగలేదు. మరోవైపు వెండి ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోతోంది. ఇక వెండి తలుచుకోవడానికీ భయపడే విధంగా ఎగసింది. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 24) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు తమ రికార్డు పరుగులు కొనసాగించి ఆల్ టైం హై కి చేరుకున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (24.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగింది. దీంతో 48,150 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 300 రూపాయలు పెరిగింది. దీంతో 52 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 52,500రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరల మోత!

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే ఏకంగా రికార్డు స్థాయిలో ఒక్కసారిగా 3050 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 62,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగింది. దీంతో 48,150 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 300 రూపాయలు పెరిగింది. దీంతో 52 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 52,500రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగి 49,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగింది. దీంతో 50,200 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 60 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 62,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story