మళ్ళీ పెరిగిన బంగారం ధరలు .. స్వల్పంగా తగ్గిన వెండి!

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు .. స్వల్పంగా తగ్గిన వెండి!
x
Highlights

నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 25) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 25) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (25.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే పెరిగాయియి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో 46,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,450 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో 46,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగి 47,050 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధర కంటే 250 రూపాయలు పెరిగింది. దీంతో 48,250 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,450 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories