gold rate : స్వల్పంగా పెరిగిన బంగారం..భారీగా తగ్గిన వెండి.. ఎంతంటే?

gold rate : స్వల్పంగా పెరిగిన బంగారం..భారీగా తగ్గిన వెండి.. ఎంతంటే?
x
Highlights

బంగారం ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. సోమవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పైకెగాశాయి. స్వల్ప పెరుగుదల ను నమోదు చేశాయి. పది గ్రాముల...

బంగారం ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. సోమవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పైకెగాశాయి. స్వల్ప పెరుగుదల ను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు 30 రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర భారీ పతనాన్ని చూసింది.. ఏకంగా కేజీ వెండి 670 రూపాయల మేర కిందికి దిగి వచ్చింది.

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (24.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 30 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,710 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 30 రూపాయల పెరుగుదలతో 43,300 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. వెండి ధర కేజీకి 670 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,880 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 30 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,710 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 30 రూపాయల తగ్గుదలతో 43,300 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 39,880 రూపాయల వద్దకు దిగివచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయల పెరుగుదలతో 41,750 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయల పెరుగుదలతో 40,550 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. 40 వేల మార్కు కంటే diగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 39,880 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories