కొద్దిగా దిగివచ్చిన బంగారం ధరలు..వెండి కూడా కిందికే!

కొద్దిగా దిగివచ్చిన బంగారం ధరలు..వెండి కూడా కిందికే!
x
Highlights

బంగారం ధరలు మెల్లగా దిగివస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా పెరిగిపోతూ కలవరపెట్టిన బంగారం ధరలు వరుసగా రెండోరోజు ఈరోజు (మే23) దేశీయంగా...

బంగారం ధరలు మెల్లగా దిగివస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా పెరిగిపోతూ కలవరపెట్టిన బంగారం ధరలు వరుసగా రెండోరోజు ఈరోజు (మే23) దేశీయంగా కాస్త నెమ్మదించాయి.. మరో వైపు వెండి ధరలు కూడా కాస్త కిందికి దిగివచ్చాయి.

బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (23.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 370 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,870 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 370 రూపాయల తగ్గుదలతో 48,680 రూపాయలు నమోదు చేసింది.

దిగివచ్చిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా కిందికి దిగివచ్చాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49వేల గరిష్ట మార్కు నుంచి కిందికి దిగివచ్చింది. కేజీ వెండి ధర 48,250 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 370 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,870 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 370 రూపాయల తగ్గుదలతో 48,680 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,250 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు కిందికి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 300 రూపాయలు తగ్గి 47,700 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల తగ్గుదలతో 45,900 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 49 వేల మార్కు కంటే కిందకు చేరి 48,250 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories