బంగారం ధరలు షాక్! మరికొంత తగ్గిన వెండి!

K V D Varma
Published on: 23 April 2020 7:00 AM IST
బంగారం ధరలు షాక్! మరికొంత తగ్గిన వెండి!
X
gold rate In India (rep.Image)

నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు షాకిచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా దేశీయంగా మాత్రం ఒక్కసారిగా పైకెగశాయి. ఈరోజు (ఏప్రిల్ 23) బంగారం ధరలు పది గ్రాములకు 680 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కింది చూపులు చూశాయి. కేజీకి 240 రూపాయల తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు పై పైకి కదిలాయి. గురువారం (23.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 650 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,050 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 680 రూపాయల పెరుగుదలతో 44,780 రూపాయలు నమోదు చేసింది.

మరికొంచెం దిగివచ్చిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదలనమోదు చేయగా వెండి ధరలు మాత్రం పడిపోయాయి. నిన్న భారీ స్థాయిలో పడిపోయిన వెండి ధర ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది. కేజీకి 240 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే కిందికి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,410 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 650 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,050 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 680 రూపాయల పెరుగుదలతో 44,780 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,410 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయల పెరుగుదలతో 44,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయల పెరుగుదలతో 42,160 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి దిగొచ్చింది. కేజీ వెండి ధర 41,410 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story