gold price : భగ్గుమన్న బంగారం..అదే దారిలో వెండి..ప్రస్తుతం బంగారం ఎంతంటే?

K V D Varma
Updated on: 23 March 2020 11:19 AM IST
gold price : భగ్గుమన్న బంగారం..అదే దారిలో వెండి..ప్రస్తుతం బంగారం ఎంతంటే?
X
gold price today

బంగారం ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కోడా పైకేగాశాయి. భారీ పెరుగుదల ను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు ఆరువందల రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా ఎగబాకింది. ఏకంగా కేజీ వెండి 50 రూపాయల మేర పెరిగింది.

హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (23.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 600 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,690 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 600 రూపాయల పెరుగుదలతో 43,270 రూపాయలు నమోదు చేసింది.

భారీగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా ఎగశాయి. కేజీ వెండి ధర కేజీకి 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,550 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 600 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,690 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 600 రూపాయల పెరుగుదలతో 43,270 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. 40 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 40,550 రూపాయల వద్దకు ఎగసింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భగ్గు మన్నాయి భారీగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయల పెరుగుదలతో 41,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 600 రూపాయల పెరుగుదలతో 40,500 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగాపెరిగాయి. 40 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 40,550 రూపాయల వద్దకు ఎగసింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story