వామ్మో..బెదరగొడుతున్న బంగారం.. దూసుకుపోయిన వెండి ధరలు!

వామ్మో..బెదరగొడుతున్న బంగారం.. దూసుకుపోయిన వెండి ధరలు!
x
Highlights

బంగారం భారీ షాక్ ఇచ్చింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజే పది గ్రాముల బంగారం దాదాపు 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్...

బంగారం భారీ షాక్ ఇచ్చింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజే పది గ్రాముల బంగారం దాదాపు 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం కూడా బంగారం భారీస్థాయిలో ఎగసింది.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీ పెరుగుదల నమోదుచేసింది. మరో 990 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 43,430 రూపాయల నుంచి 44,420 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 910 రూపాయలు పెరిగింది. దీంతో 39,810 రూపాయల నుంచి 40,720 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది..

దూసుకుపోయిన వెండి ధరలు..

బంగారం ధరతో పాటు, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కసారిగా కేజీ వెండి ధర 1000 రూపాయలకు పైగా పెరిగింది. దీంతో వెండి ధర నిన్నటి కేజీ కి 49,900 రూపాయల ధర నుంచి ఒక్కసారే 51,000 రూపాయలకు ఎగసింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 44,420 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 40,720 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధర లు ఇక్కడా భారీ షాకిచ్చాయి. కేజీకి 1100 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కెజీ వెండీ 51,000 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయలు ఎగసి 42,800 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 900 రూపాయలు పెరిగి 41,600 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 51,000 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories